సెన్సెక్స్‌కు 941 పాయింట్ల లాభం

Apr 29,2024 22:12 #Business, #sensex

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలాంశాలతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. మార్చి త్రైమాసిక ఫలితాల అనంతరం బ్యాకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్‌లో బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ క్రమంలోనే బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 941 పాయింట్ల లాభంతో 74,671కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 223 పాయింట్లు లాభపడి 22,643.40 వద్ద ముగిసింది. బిఎస్‌ఇలో 1,777 షేర్లు రాణించగా.. 1578 షేర్లు పతనాన్ని చవి చూశాయి. నిఫ్టీలో ఐసిఐసిఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బిఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సూచీలు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరసలో ఉన్నాయి.

➡️