క్యాప్రీ గ్లోబల్‌ షేర్ల విభజన

Feb 12,2024 20:50 #Business

ముంబయి : ఎంఎస్‌ఎంఇ, అఫర్డబుల్‌ హౌసింగ్‌ రంగ ఎన్‌బిఎఫ్‌సి అయినా క్యాప్రీ గ్లోబల్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (సిజిసిఎల్‌) డైరెక్టర్ల బోర్డు స్టాక్‌ విభజన, 1:1 బోనస్‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది. పబ్లిక్‌ ఇష్యూ, ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లు విడతల వారీగా రూ.500 కోట్ల వరకు జారీ చేసేందుకు కంపెనీ బోర్డు అంగీకరించినట్లు పేర్కొంది. జనవరి 27న జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో రూ.2 ముఖ విలువ కలిగిన ఒక ఈక్విటీ షేరును రూ.1 ముఖ విలువ కలిగిన రెండు ఈక్విటీ షేర్లుగా విభజించనుంది. దీనికి కంపెనీ అసాధారణ సర్వసభ్య సమావేశంలో వాటాదారుల ఆమోదానికి లోబడి స్టాక్‌ విభజన, బోనస్‌ కోసం కంపెనీ రికార్డు తేదీని 2024 మార్చి5 గా నిర్ణయించింది.

➡️