ఇవి రుణాల కోసం ఇవిఫిన్‌ : గ్రీవ్స్‌ ఫైనాన్స్‌

Apr 10,2024 21:12 #Business

హైదరాబాద్‌ : బ్యాంకింగేతర విత్త సంస్థ గ్రీవ్స్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కేవలం ఇవి రుణాల జారీ కోసమే ఇవిఫిన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నూతన వేదికను హైదరాబాద్‌లో ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఇతర సుస్థిర పరిష్కారాలను అందించనుందని వెల్లడించింది. తక్కువ వడ్డీ రేట్లను కోరుకునే వారికి ఇందులో అనేక అప్షన్లు ఉన్నాయని తెలిపింది.

➡️