ఇఎంసి స్వాధీనానికి సకాలంలో చెల్లింపులు

May 22,2024 21:25 #Business

సలాసర్‌ టెక్నో వెల్లడి
హైదరాబాద్‌ : ఇఎంసి లిమిటెడ్‌ స్వాధీనానికి సకాలంలో పూర్తి చెల్లింపులు చేసినట్లు సలసార్‌ టెక్నో ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. తమ వ్యూహాత్మక విస్తరణ ప్రయాణంలో ఒక స్మారక మైలురాయిగా ఇది నిలుస్తుందని పేర్కొంది. తమ సామర్థ్యం మా ప్రణాళికలను ఖచ్చితత్వంతో, చురుకుదనంతో అమలు చేయడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుందని తెలిపింది. ఇటీవల ఆ సంస్థ దివాలకు వచ్చిన ఇఎంసి లిమిటెడ్‌ను ఎన్‌సిఎల్‌టి ద్వారా దక్కించుకుంది. దీని మొత్తం స్వాధీన విలువ రూ.178 కోట్లుగా ఉంది. ఇఎంసి స్వాధీనంతో ఇంజనీరింగ్‌, మౌలిక వసతుల రంగంలో సలాసర్‌ టెక్నో మరింత బలోపేతం కానుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

➡️