తొలి యుపిఐ చెల్లింపునకు 4 గంటలు ఆగాల్సిందే..!

Nov 28,2023 21:05 #Business

రూ.2వేల పైబడిన మొత్తాలకు నిబంధన

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల్లో సైబర్‌ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోందని సమాచారం. ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్‌లైన్‌ లావాదేవీకి నాలుగు గంటల వ్యవధి తర్వాతనే చెల్లింపులు జరిగేలా కొత్త నిబంధన ప్రవేశపెట్టనుంది. రిటైల్‌ లావాదేవీల్లో ఇబ్బంది లేకుండా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తం చెల్లింపులకు మాత్రమే కొత్త నిబంధనను వర్తింపు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనంలో తెలిపింది. సైబర్‌ మోసాలను అరికట్టేందుకు ఇది దోహదం చేయనుంది. కొత్తగా యుపిఐ ఖాతా ప్రారంభించినప్పుడు మొదటి 24 గంటల్లో కేవలం రూ.5,000 చెల్లింపునకు మాత్రమే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.

➡️