అంగన్‌వాడీలకు లబ్ధిదారుల సంఘీభావం

మండపేటలో సమ్మెలో పాల్గొన్న అంగన్‌వాడీలు, లబ్ధిదారులు

ప్రజాశక్తి-యంత్రాంగం

అంగన్వాడీలు డిమాండ్ల సాధనకు కోసం చేస్తున్న అంగన్‌వాడీల సమ్మె ఆదివారం ఆరోరోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు వచ్చే లబ్ధిదారులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు వారి సమ్మెకు మద్దతు తెలిపాయజేశారు.మండపేట తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరిగిన నిత్యవసరాల ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీస వేతనం, పిఎఫ్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కల్పించాలని, పనిభారం తగ్గించాలని, ఆయాలకు ప్రమోషన్‌ వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని తదితర అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న సిఎం జగన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ సమ్మెకు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపేట ప్రాజెక్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.బేబీ, ఆదిలక్ష్మి, సిహెచ్‌.రాణి, మంగాదేవి, జానకి, అనంత, దేవకి, దుర్గా, వజ్రం, కుమారి, నాగలక్ష్మి, కమల, సత్యవేణి, పద్మ, నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం అంగన్‌ వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్షలు 6వ రోజైన ఆదివారం పిల్లల తల్లులు దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద దీక్షల్లో పిల్లల తల్లులు పాల్గొని అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ సెంటర్‌ వరకు అంగన్‌వాడీలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు దుర్గా మహేశ్వరి కార్యదర్శి జయలక్ష్మి, ప్రాజెక్ట్‌ కమిటీ సభ్యులు తలుపులమ్మ, సుభాషిణి, శ్రీదేవి, సుబ్బలక్ష్మి, విజయ, అనంత లక్ష్మీ, రమాదేవి, అరుణ పలువురు అంగన్‌ వాడీి కార్యకర్తలు మరియు సహాయకులు పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు బిఎస్‌పి నాయకులు మద్దతు తెలిపారు. రామచంద్రపురం అంగన్‌వాడీల సమ్మెకు ప్రీస్కూల్‌ పిల్లలతో సహా వారి తల్లిదండ్రులు పాల్గొని సంఘీభావం తెలిపారు .సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరామ్‌, అంగనవాడి జిల్లా కార్యదర్శి ఎం .దుర్గ, వి. వీరలక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా అంగన్‌వాడీల సమ్మె కొనసాగింది. రామచంద్రపురం, కె.గంగవరంమండలాల అంగన్‌వాడీలు, లబ్దిదారులు, ఫ్రీ స్కూల్‌ పిల్లలులి పెద్ద సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్‌ స్టాలిన్‌ పాల్గొని ప్రసంగించారు. సమ్మెలో అంగనవాడి జిల్లా సభ్యులు వాసంశెట్టి సూర్యకుమారి, మండల అధ్యక్షులు కె.విజయలక్ష్మి, జి.శ్రీదేవి, సెక్టార్‌ లీడర్స్‌ జహీరా, కె.దుర్గ, జి.వెంకటరత్నం. గోంతి దేవి, వీర వేణి, సత్యవతి, అంగన్‌వాడీ వర్కర్స్‌ పాల్గొన్నారు. మామిడికుదురు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని చేస్సున్న సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరుకుంది. అంగన్‌ వాడీ పిల్లలతో వారి తల్లితండ్రులు ఆదివారం సమ్మ్‌ మద్దత్తు తెలిపారు. అమలాపురం అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెను ఆదివారం 6వరోజు కొనసాగింది. ఈ సందర్భంగా అమలాపురం సిడిపిఒ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమ్మె శిబిరంలో టిడిఎస్‌సి నాయకులు రేవు తిరుపతిరావు పాల్గొని అంగన్‌వాడీలకు తమ సంఘీభావం తెలిపారు. తమ న్యాయమైన కోరికలు సాధనలో భాగంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. సమ్మెలో పి. అమూల్య, విజయ, రత్నకుమారి, మణిమాల, దైవకప, బేబీ గంగ రత్నం, ఐసిడిఎస్‌ ప్రాజెక్టుకు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. ఐ.పోలవరం నాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో ఉన్న 504మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో ఆయా మండలాలు పరిధిలో ఉన్న 250అంగన్‌ వాడీ కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి.

 

➡️