అంగన్‌వాడీల కోటి సంతకాల సేకరణ

అంగన్‌వాడీల సమ్మెకు ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా 32వ రోజు ఆందోళనలు కొనసాగాయి.ప్రజాశక్తి-యంత్రాంగంకాకినాడ 24 గంటల రిలే దీక్షా శిబిరంలో సంతకాల సేకరణను ఐడియల్‌ కాలేజీ కరస్పాండెంట్‌ చిరంజీవినీ కుమారి తొలి సంతకం చేసి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యమం విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత మార్గంలో అంగన్వాడీలు చాలా పట్టుదలతో నెలరోజుల నుంచి ఉద్యమం నిర్వహిస్తున్నారని కొనియాడారు. మహిళలు మహాశక్తివంతులని నిరూపిస్తూన్నారన్నారు. ఈ దీక్షా శిబిరంలో వీరమణి, సరోజిని, చామంతి, విజయ, సుధ, భవాని, సునీత, సుజాత, జోగమ్మ, వరలక్ష్మి, వ్యాపారమ్మ, రాధా, సునీత, సత్యవేణి పాల్గొన్నారు. సమగ్రశిక్ష ఉద్యోగుల జెఎసి నాయకులు మహాలక్ష్మి, రాజు, గంగాధర్‌, సత్యనాగమణి, కిరణ్‌, చంటిబాబు, ఐద్వా నాయకులు భవాని, చెక్కా రమణి, జనవిజ్ఞాన వేదిక నాయకులు కెఎంఎంఆర్‌.ప్రసాద్‌, వర్మ మద్దతు తెలిపారు. పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌లో అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు మాజీ కేంద్రమంత్రి ఎంఎం.పల్లంరాజు, కాంగ్రెసు నాయకులు వచ్చి మద్దతు తెలిపారు. పల్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ వ్యవస్థ ప్రారంభించి బలోపేతం చేశారన్నారు. మహిళలు, బాలింతలు, గర్భిణులు, బాలలకు అమ్మ తర్వాత అమ్మగా ఎన్నో సేవలందిస్తున్న అంగన్వాడీలను రోడ్డున పడేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తిం చంటిబాబు, నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల దొరబాబు, సోనీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.సత్తిరాజు, క్రాంతికుమార్‌, సూరిబాబు, నాయకులు దాడి బేబీ, నాగమణి, అమల, ఎస్తేరు రాణి, బాలం లక్ష్మి, టిఎల్‌.పద్మావతి, లోవ తల్లి, వరలక్ష్మి, వెంకటలక్ష్మి, మన కుమారి, తులసి పాల్గొన్నారు. అంగన్‌వాడీలకు మద్దతుగా ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార జాతా మున్సిపల్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రారంభమైంది. అనంతరం ర్యాలీగా మున్సిపల్‌ సెంటర్‌లోని అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు వెళ్లి ఐద్వా నాయకులు మద్దతు తెలిపారు. ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌.రమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, పద్మ, నేదునూరి రమ్య తదితరులు పాల్గొన్నారు.తాళ్లరేవు అంగన్‌వాడీల సమ్మెకు ఐద్వా నాయకులు రమణి, ఫాతిమా, వరలక్ష్మి, గంగాభవాని మద్దతు తెలిపారు. కోటనందూరు సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె.పద్మ ఆధ్వర్యంలో అంగన్వాడీ నాయకులు, ఆశ, మిడ్డే వర్కర్లు సిబ్బందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు లీల, జగదీష్‌, లోవ, పద్మ, ఆమని నాగమణి పాల్గొన్నారు.కరప ఐద్వా ప్రచార జాతా తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరం వద్దకు వచ్చింది. ఐద్వా నాయకులు సిహెచ్‌.రమణి, వరలక్ష్మి, భవాని, ఫాతిమా, వెంకటలక్ష్మి మద్దతు తెలిపారు. అంగన్వాడీలు వీరవేణి, ఎం.వరలక్ష్మి, భవాని, సాయి, కల్పలత పాల్గొన్నారు.ఏలేశ్వరం అంగన్‌వాడీలు సమ్మెలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకరపల్లి సునీత, ఎన్‌.అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి, జె.రాణి, పి.నూకరత్నం, ఆర్‌.రత్నకుమారి, పి.దుర్గాసూర్యకుమారి, కె.రమ్య, పి.గంగాభవాని, కె.బంగారుపాప, బి.కృపావతి ఉన్నారు.పిఠాపురం (గొల్లప్రోలు) తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో సంతకాల సేకరణ చేపట్టారు. డి.పద్మావతి, సిఐటి నాయకులు కె.చిన్న మాట్లాడారు. ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.పద్మ, మెడికల్‌ రిప్‌ డి.ప్రసాద్‌ రావు మద్దతు తెలిపారు. డి.తులసీదేవి, విజయశాంతి, వి.వెంకటలక్ష్మి, ప్రజావాణి, రామలక్ష్మి, అమల, సూర్యకాంతం, సత్యవతి, నళిని, వి.సునీత పాల్గొన్నారు.

➡️