అంగన్‌వాడీల రిలే నిరహారదీక్షలు

Dec 23,2023 23:17
తమ సమస్యల పరిష్కారం

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగిన అంగన్‌వాడీల వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. శనివారం నాటికి వారి ఉద్యమం 12వ రోజుకు చేరింది. జిల్లాలోని పలు మండలాలు, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో రిలే నిరహారదీక్షలు చేపట్టారు.

పెదపూడి స్థానిక మండల పరిషత్‌ కార్యాల యం వద్ద రిలే నిరహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి పాల్గొని మాట్లాడారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లిం చాలని, రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని, మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీలకు గ్రాడ్యుటి అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు రాజేశ్వరి, యూనియన్‌ జిల్లా కార్యదర్శి చంద్రావతి, కనకదుర్గ, ఎం.భూదేవి, బి.అరుణ, ఎస్‌.పద్మ, అర్‌.సూర్య కల, తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న నిరసన శిబిరంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను యూనియన్‌ జిల్లా కోశాధికారి జి.రమణమ్మ, ఆర్‌టిఐ జెఎసి రాష్ట్ర అధ్యక్షులు పప్పు దుర్గాప్రసాద్‌, సుందర పల్లి వివిఎస్‌ గోపాలకృష్ణ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు కె.సతీష్‌, దండ్రు ప్రోలు నాగబాబు, న్యాయవాది గణేష్‌ ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, పెన్షనర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె.సత్తిరాజు మద్దతు తెలిపారు. నిరహారదీక్ష చేపట్టిన అంగన్‌వాడీలకు సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎం.నూకరత్నం, ఎస్‌.మీనాకుమారి, వి.పోసిరత్నం, వై.రామలక్ష్మి, జె.బుజ్జమ్మ, డివిడి భవాని, టి.వీరవేణి, తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల దీక్షా శిబిరాన్ని యుటిఎఫ్‌ నాయకులు మెతకాని రాంబాబు, జట్ల సోమరాజు, ఎ.ఆదివిష్ణు, రాజశేఖర్‌, రవి, సిపిఐ ఎంఎల్‌ వినోద్‌ మిశ్రా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోసిరెడ్డి గణేష్‌, ప్రత్తిపాడులో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ వరుపుల సత్యప్రభ, టిడిపి నేతలు బద్ధిరామారావు, పర్వత సురేష్‌, జనసేన, సిఐటియు నాయకులు సంఘీభావం తెలి పారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత, నాయకులు ఎన్‌. అమలావతి, సిహెచ్‌.వెంకటలక్ష్మి, జె.రాణి, పి.నూకరత్నం పాల్గొన్నారు.

కాజులూరు స్థానిక పంచాయతీ కార్యా లయం వద్ద నిర్వహిస్తున్న నిరహారదీక్షలో జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి వల్లు రాజబాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం, పి.రామలక్ష్మి, కంచర్ల నాగమణి, మేడిశెట్టి బైరవకుమారి, పి.సుజాత, కె.కమలాదేవి, తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు రిలే నిరహారదీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూని ున్‌ నాయకులు ఆదిలక్ష్మి మాట్లాడారు. ఈ దీక్షలకు ప్రజాసంఘాల నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, వళ్ళు రాజుబాబు మద్దతు ఇచ్చారు. దీక్షచేసిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. కరప స్థానిక తహవీల్దార్‌ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో చేపట్టిన రిలే నిరహరదీక్షను సిఐటియు మండల కార్యదరి బి.రాంప్రసాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.వీరవేణి, ఎస్‌.వరలక్ష్మి, ఎస్‌ఎస్‌.కుమారి, దైవకుమారి, అచ్చారత్నం, కల్పలత, తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్లో జరుగుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు రిలే నిరహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షలను యూనియన్‌ నాయకులు సుబ్బలక్ష్మి, సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు దాడి బేబీ, ఎస్తేరు రాణి, నాగమణి, అమల, టిఎల్‌.పద్మావతి, కాలే దేవి, జె కుమారి, తదితరులు పాల్గొన్నారు.

కిర్లంపూడి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ సమీపంలో అంగన్‌వాడీల నిరసన శిబిరంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షను సిఐటియు మండల అధ్యక్షుడు టి.జీవ, యూనియన్‌ నాయకురాలు ఈశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సిహెచ్‌.రత్నం, పి.సావిత్రి, షేక్‌ పరివిన్‌, జి.రత్నం, పి. మంగాయమ్మ, పి. ప్రభావతి, హసీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరసన శిబిరంలో అంగన్‌వాడీలు రిలే నిరహారదీక్ష చేపట్టారు. ఈ శిబిరాన్ని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు, సిఐటియు నాయకులు కరణం విశ్వనాధం, వీరబాబు, నాగేశ్వరరావు ప్రారంభించారు. సాయంత్రం ఐదు గంటలకు అంగన్‌వాడీల దీక్షలను కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు కూరాకుల సింహాచలం, ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్‌.భాస్కరాచార్యులు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ, ప్రాజెక్టు అధ్యక్షురాలు తులసి, నళిని, ప్రజావాణి, విజయశాంత, అమల, బేబీ, తదితరులు పాల్గొన్నారు.

➡️