రాక్ సిరామిక్స్ వ‌ద్ద కార్మికుల‌ అర్ధ‌న‌గ్న నిర‌స‌న

Jun 27,2024 13:35 #Kakinada

కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తాం – సిఐటియు ఉపాధ్య‌క్షులు సూరిబాబు
ప్రజాశక్తి-సామర్లకోట : రాక్ సిరామిక్స్ లో తొల‌గించిన కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని కోరుతూ చేస్తున్న ఆందోళ‌న 15వ రోజుకు చేరుకుంది. గురువారం కంపెనీ గేటు ముందు సిరామిక్స్ కార్మికులు అర్ధ‌న‌గ్న నిర‌స‌న తెలిపారు. చొక్కాలు విప్పి నిర‌స‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో సిఐటియు ఉపాధ్య‌క్షులు నీల‌పాల సూరిబాబు మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజ‌మాన్యానికి కార్మికుల తొలగింపు అనేది అల‌వాటుగా మారిపోయింద‌న్నారు. ప‌ర్మినెంట్ వ‌ర్క‌ర్లను తొల‌గించి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ‌ర్క‌ర్ల‌ను జాయిన్ చేసుకుంటున్నార‌ని అన్నారు. గుజ‌రాత్‌, బీహార్‌, ఒరిస్సా నుండి కార్మికుల‌ను తీసుకువ‌చ్చి కంపెనీ చుట్టుప‌క్క‌ల ఉండే కార్మికుల‌ను విధుల నుండి తొల‌గించేస్తున్నార‌ని అన్నారు. న‌ష్టాల పేరుతో అబ‌ద్దాలు చెబుతూ కార్మిక చ‌ట్టాల‌ను అమలు చేయ‌కుండా జాయింట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ మాటనుకూడా లెక్క‌చేయ‌కుండా యాజ‌మాన్యం వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్నారు. త‌క్ష‌ణం కార్మికుల‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని లేనిప‌క్షంలో అన్ని రంగాల కార్మికుల‌తో క‌లిపి గేటు ముందు ఆందోళ‌న నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.
సిఐటియు జిల్లా కార్య‌ద‌ర్శి డి. క్రాంతి కుమార్‌. సామ‌ర్ల‌కోట సిఐటియు కార్య‌ద‌ర్శి సురేష్‌, పెద్దాపురం సిఐటియు అధ్య‌క్షులు గ‌డిగ‌ట్ల స‌త్తిబాబు, ప్ర‌జానాట్య‌మండ‌లి క‌ళాకారులు కృష్ణ‌, వీర్రాజులు ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్యక్ర‌మంలో చంద్ర‌శేఖ‌ర్‌, గంగాధర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జున్ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివ నారాయణ, సుబ్బారావు త‌దిత‌రులు పాల్గోన్నారు.

➡️