అంగన్‌వాడీల ర్యాలీ

Dec 19,2023 22:01
ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

ఫొటో : ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
అంగన్‌వాడీల ర్యాలీ
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా 8వ రోజు మంగళవారం ఇందుకూరుపేటలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందుకూరుపేట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం నుండి తహశీల్దార్‌ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సిఐటియు అధ్యక్షులు టివివి ప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 7రోజుల నుండి అంగన్‌వాడీ వర్కర్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. వైసిపి ప్రభుత్వం విధానాలకు నలిగిపోతున్న ప్రభుత్వ అధికారులు అంగన్‌వాడీ వర్కర్లకు సపోర్ట్‌ చేయాల్సింది పోయి ప్రభుత్వానికి వంత పాడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్‌ నాయకులు ఎస్‌కె చాన్‌బాషా, మనోహర్‌, దయాసాగర్‌, వెంకయ్య, వెన్ను వేణు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️