అంగన్‌వాడీల వంటావార్పు

Dec 14,2023 21:57
వంటా వార్పు చేస్తున్న అంగన్‌వాడీలు

వంటా వార్పు చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల వంటావార్పు
ప్రజాశక్తి ఇందుకూరుపేట:అంగన్‌వాడీల డిమాండ్ల పరిష్కారం కోరుతూ మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె రెహనా బేగం, జిల్లా ఆటో కార్మిక సంఘం కార్యదర్శి కోలగట్ల సురేష్‌, అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌, ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షులు మారుబోయిన రాజా, సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, ఆటో యూనియన్‌ నాయకులు ఎస్‌.కె చాన్‌ బాషా, దయాసాగర్‌, మనోహర్‌, వెన్ను వేణు తదితరులు పాల్గొన్నారు.

➡️