అంగన్‌వాడీ వర్కర్ల నిరసన

Dec 23,2023 21:46
ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు
అంగన్‌వాడీ వర్కర్ల నిరసన
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట శనివారం అంగన్‌వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు జగన్‌ ప్రభుత్వంపై పేరడీ సాంగ్స్‌ ఆలపిస్తూ ప్రభుత్వా విధానాన్ని అద్దం పట్టారు. అంగన్‌వాడీలు ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఆటో యూనియన్‌ అధ్యక్షులు మారుబోయిన రాజా విచ్చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలతో కలిసి ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు తీరేంత వరకు ఈ ఉద్యమం ఆగదన్నారు. న్యాయమైన డిమాండ్లైన వాటిని తీర్చకుండా ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్స్‌ను చిన్నచూపు చూస్తుందన్నారు. కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి బర్త్‌ డే యార్డులకి ఖర్చు చేస్తారు గానీ అంగన్‌వాడీ వర్కర్స్‌ వేతనాలు మాత్రం పెంచరని దుయ్యబట్టారు. అంగన్‌వాడి వర్కర్స్‌ డిమాండ్స్‌ తీర్చకపోతే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు, కోనేటి శివకుమార్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️