అంతర్జాతీయ నగరంగా విశాఖ

అంతర్జాతీయ నగరంగా విశాఖ

– మేయర్‌ హరి వెంకట కుమారి

ప్రజాశక్తి- గాజువాక: అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి అన్నారు. బుధవారం 72వ వార్డు వంద అడుగుల రోడ్డులో రూ.2 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ విశాఖ నగరంలో రోడ్లు, ఇతర ఆధునికీకరణ పనులకు జివిఎంసి కోట్లాది రుపాయాలను ఖర్చు చేస్తోందన్నారు. నగరాభివృద్ధిపై సిఎం జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక సమగ్రాభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వార్డు కార్పొరేటర్‌ ఎజె స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గాజువాక జోనల్‌ కమిషనర్‌ పి.సింహాచలం, వార్డు వైసిపి ఇన్‌ఛార్జి సిరట్ల వాసు, టిడిపి నేత సాలాపు రామారావు, స్థానిక నాయకులు సత్యనారాయణ, జి.ఆనంద్‌, అప్పారి విష్ణుమూర్తి పాల్గొన్నారు.

శంకుస్థాపన చేస్తున్న మేయర్‌, పక్కనే ఎమ్మెల్యే నాగిరెడ్డి

➡️