అంబేద్కర్‌కు ఘన నివాళి

 

అమలాపురంలో అంబేద్కర్‌ చిత్రపటం వద్ద ఎంఎల్‌సి ఐవి తదితరుల నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా బుధ వారం జిల్లాలో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, అది óకారులు, ప్రజాసంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ప్రజాశక్తి-యంత్రాంగం

అమలాపురం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ చూపిన మార్గంలో నడవడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ఎంప్లాయీస్‌ హోమ్‌ నందు యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి ఐవి, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటివి సుబ్బారావు, అధ్యక్షలు పెంకె వెంకటేశ్వరరావు, వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు జివి.రమణ, దుర్గాప్రసాద్‌, పెన్నాడ శ్రీనివాస్‌, బిఎన్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో భారత రిపబ్లిక్‌ పార్టీ, దళిత ఐక్యవేదిక, పిడిఎస్‌ యు విద్యార్థి సంఘం దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ నందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, తుపాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి జి.జయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆలమూరు ఎస్‌ఐ ఎల్‌.శ్రీను నాయక్‌ రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉప్పలగుప్తం అంబేద్కర్‌ విగ్రహానికి జెడ్‌పిటిసి సభ్యుడు గెడ్డం సంపదరావు, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ బోర్డు సభ్యుడు జిన్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం నందు అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమం కమిషనర్‌ జి.లోవ రాజు అధ్యక్షతన జరిగినది. నగర పంచాయతీ చైర్మన్‌ కమిడీ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట మండల విద్యా వనరుల కేంద్రం వద్ద అంబేద్కర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎంఇఒ-1 కాండ్రేగుల వెంకటేశ్వరరావు తదితరులు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామచంద్రపురం ద్రాక్షారామ-యానాం సెంటర్లో అంబేద్కర్‌ వర్ధంతిని జై భీమ్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. అయినవిల్లి ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్‌ కులాల సంక్షేమ సంఘం అయినవిల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి ముక్తేశ్వరం సెంటర్లో జరిగింది. మామిడికుదురు మామిడికుదురు సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహానికి పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి టు మెన్‌ కమిటీ నామన రాంబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండపేట మండలంలోని జడ్‌.మేడపాడు గ్రామంలో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్‌ విగ్రహానికి సర్పంచ్‌ కంచర్ల చంద్రశేఖర్‌ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ వడ్డీ రాజు, దళిత నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో వాణీమహల్‌ జంక్షన్‌ వద్ద అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాల ఏర్పాటు చేయడం అభినందనీయమని మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యులు రెడ్డి రాజబాబు, వైసిపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అన్నారు. విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

 

 

➡️