అంబేద్కర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

Feb 27,2024 20:58

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి మంగళవారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగనా ఆయన మాట్లాడుతూ స్థానిక అంబేద్కర్‌ జంక్షన్లో ఉన్న భవనం శిథిóలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో రూ.1.55కోట్లతో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందుకోసం రూ.40 లక్షలు ఇప్పటికే మంజూరైనట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని లిఖించిన అంబేద్కర్‌ ఆశయాలను అనుసరించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. త్వరలోనే భవన నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ లయా యాదవ్‌, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు బోనెల ధనలక్ష్మి, పట్నాన పైడిరాజు, పొట్నూరు శ్రీనివాసరావు, రేగాన రూపాదేవి, దాసరి సత్యవతి, పట్టా ఆదిలక్ష్మి, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

రూ.12.50 లక్షలతో నిర్మించిన రోడ్డు ప్రారంభం

నగరంలోని 40వ డివిజన్‌లో రూ.12.50లక్షలతో నిర్మించిన రహదారిని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్‌ డిప్యూటీ మేయర్‌ లయ యాదవ్‌, స్థానిక కార్పొరేటర్‌ బోనెల ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా ఐదేళ్లుగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కషిచేసి సఫలీకతులయ్యారని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ విజయలక్ష్మి, కార్పొరేటర్‌ వింత ప్రభాకర్‌ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ సాంబమూర్తి, మత్స సత్యనారాయణ, డివిఆర్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

గాజులరేగలో ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరాలు పేదలకు మరింత ఉపయుక్తంగా ఉండగలవని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. గాజులరేగలో యువత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన పేదలకు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉచిత శిబిరం నిర్వహకులు ప్రసాద్‌, వైసిపి నగర ప్రధాన కార్యదర్శి జామాన శ్రీనివాసరావు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి ఇచ్చిన స్ఫూర్తితో పేదలకు సేవా కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ నడిపల్లి ఆదినారాయణ, వైసిపి నాయకులు కనుగల రాజా, గార సత్యనారాయణ, మధు తదితరులు పాల్గొన్నారు.

➡️