అంబేద్కర్‌ విగ్రహాలకు అంగన్‌వాడీల వినతులు

Dec 7,2023 00:24
ఈ కార్యక్రమంలో మనోజ,

ప్రజాశక్తి – యంత్రాంగం తమ సమస్యల పరిష్కా రం కోసం ఈ నెల 8 నుంచి సమ్మె లోకి వెళ్లున్న అంగన్‌వాడీలు బుధ వారం వినూత్నంగా తమ పోరాటాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం దంటూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందించారు. పెద్దాపురం గత ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్‌వాడీలు అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు టిఎల్‌.పద్మావతి, కాలే దేవి, స్నేహలత, సిఐటియు మండల కార్యదర్శి డి.క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జగ్గంపేటలో అంబేడ్కర్‌ వర్థంతి సందర్భంగా మండల అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు రత్నం, సుజాతల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు. నేటి నుంచి జరగబోయే సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృపాభారు, వెంకటలక్ష్మి, చంటమ్మ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు. కరప స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి అంగన్‌వాడీలు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మనోజ, కల్పలత, జ్యోతి, సత్యవతి, హైమా. దుర్గ పాల్గొన్నారు.

➡️