‘వేమిరెడ్డి’కి పలువురు అభినందనలు

Jun 24,2024 20:21
'వేమిరెడ్డి'కి పలువురు అభినందనలు

శుభాకాంక్షలు తెలుపుతున్న రూప్‌కుమార్‌ యాదవ్‌
‘వేమిరెడ్డి’కి పలువురు అభినందనలు
ప్రజాశక్తి-నెల్లూరు : పార్లమెంట్‌ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఢిల్లీలో సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌లో ప్రమాణస్వీకార్సోవ కార్యక్రమం ముగిసిన అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటి మేయర్‌ రూప్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు. వేమిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సతీమణి , కోవూరు ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తనయులు అర్జున్‌రెడ్డి, కుటుంబ సభ్యులు హనీష్‌ ఉన్నారు.

➡️