అక్రమ అరెస్టులపై అంగన్వాడీ ఆగ్రహం

అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాం డ్లు పరిష్క రించాలని 42 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈనెల 21న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు. ఈనేపథ్యంలో పోలీసులు వారికి ఎక్కడికక్కడ అరెస్టు, గృహ నిర్బంధం, నోటీసులు అందజేశ ారు. ప్రభుత్వ నిర్బంధన చర్యలను నిరసిస్తూ సోమవారం కడప నగరంలో సిఐటియు, అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. పొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. బి.మఠంలో చలో విజయవాడకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 24న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రజాశక్తి-యంత్రాంగం కడప అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని 43 రోజులుగా సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవడం దారు ణమని, చలో విజయవాడకు తరలి వెళుతున్న నాయకులను, కార్యకర్తలను, ఆయాలను ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టు చేయించడం దుర్మార్గమని సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మిదేవి, బి.లక్ష్మిదేవి అన్నారు. సోమవారం పాతబస్టాండ్‌లో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరడం తప్పా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీలను మగపోలీసుల చేత అరెస్టు చేయించడానిన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అర్థరాత్రి రైలు దింపి పోలీసు స్టేషన్‌కు తరలించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని చెప్పారు. అంగన్‌వాడీలతో పెట్టుకు ఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదని గుర్తు చేశారు. జగన్‌కు జైలు, ఇంటికి పరిమితం చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంల సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఓబులేసు, నాయకులు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. జమ్మలమడుగు : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయ ఆవరణంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న దీక్షలు సోమవారం 42వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి.విజరు మాట్లాడుతూ విజయవాడలో జరుగుతున్న ఆమరణ దీక్షకు మద్దతుగా వెళ్తున్న మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని అవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు భాగ్యమ్మ, లక్ష్మీదేవి , కులాయమ్మ , విద్యార్థి యువజన సంఘల బాధ్యుడు వినరు కుమార్‌, సిఐటియు ఆటో స్టాండ్‌ అధ్యక్షుడు ఆదాం మరియు అంగన్వాడీ వర్కర్స్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : చలో విజయవాడ కార్యక్రమానికి ప్రయివేట్‌ బస్సులలో వెళ్తున్న అంగన్వాడీలను పోరుమామిళ్ల వద్ద ఆపడాన్ని ప్రొద్దుటూరులో ఎక్కడెక్కడ అంగన్వాడీ వర్కర్లను అడ్డుకోవ డాన్ని, నాయకుల ఇళ్ల వద్ద పోలీసులను కాపాలాగా ఉంచడాన్ని నిరసిస్తూ సోమవారం ప్రొద్దుటూరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌ వద్ద అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల టెర్మినేషన్‌ లెటర్‌ ఇచ్చి తొలగిస్తామని చెప్పడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. వెంటనే యూనియన్‌ లీడర్ల ఇంటి వద్ద ఉన్న పోలీసులను తిరిగి పోలీస్‌ స్టేషన్‌ లకు పిలిపించుకున్న తర్వాత ఆందోళన విరమించారు. మద్దతుగా సిఐటియు కార్యదర్శి విజరు కుమార్‌ మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి సాల్మన్‌ అధ్యక్షులు చంటి కోశాధికారి రాఘవ ఆటో యూనియన్‌ కార్యదర్శి శేఖర్‌ ఐద్వాజిల్లా కార్యదర్శి ముంతాజ్‌ బేగం పట్టణ అధ్యక్షులు వెంకటసుబ్బమ్మ రాములమ్మ లక్ష్మీదేవి డివైఎఫ్‌ఐ నాయకులు డేవిడ్‌ అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సువార్తమ్మ సునీత పద్మ సుబ్బలక్ష్మి నాగవేణి కష్ణవేణి లక్ష్మీదేవి అంగన్వాడి వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జమ్మలమడుగు రూరల్‌ : . సోమవారం అంగ న్వాడీకార్యకర్తలకు మద్దతుగా అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్థానిక పాత బస్టాండ్‌ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని 42 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చలించగపోగా వారిపై నిరంకుశంగా కర్కశంగా వ్యవహరించే పద్దతిలో కోటి సంతకాలతో ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వాలని ఛలో విజయవాడకి అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పిలుపునిస్తే వారి పై ప్రభుత్వం ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటిగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అర్థరాత్రి అంగన్వాడీి వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గపు చర్యని సిపిఎం పట్టణ కార్యదర్శి జి. ఏసుదాసు అన్నారు. బి.కోడూరు ఎస్‌ఐని సస్పెండ్‌ చేయాలి బద్వేల్‌ : అంగన్వాడీల కార్యకర్తలపై అనుచితంగా ప్రవర్తించిన బి. కోడూరు ఎస్‌ఐ జయరాములను వెంటనే సస్పెండ్‌ చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె. నాగేంద్రబాబు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. వారి మద్దతుగా సిఐటియు, డివైఎఫ్‌ఐ నాయకులు పాల్గొని మాట్లాడారు. చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వాడీలను బస్సును దొంగల్లాగా, తీవ్ర వాదుల్లాగా వెంబడించి గుంటూరు సమీపంలో అడ్డుకోని తిరిగి బద్వేలు ప్రాంతానికి తరలించారని చెప్పారు. తరలించే క్రమంలో కనీసం మూత్ర విసర్జనకు కూడా వెళ్ళనివ్వకుండా, మంచినీరు తాగేందుకు ఆహారం తినేందుకు అవకాశం కల్పించడం పోవడంతో, అంగన్వాడీ కార్యకర్తలు రాధమ్మ, రత్తమ్మ అనారోగ్యానికి గురయ్యారని వాపోయారు. పైగా ఎస్‌ఐ మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని, సర్ది చెప్పాలని ప్రయత్నించిన సిఐటియు జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, డివైఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఆంజనేయుల పై దురుసుగా ప్రవర్తించి, గెంటి వేసే ప్రయత్నం చేయడం సరైనది కాదని వాపోయారు. ఎస్‌పి స్పందించి ఎస్‌ఐపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అరెస్టు దారుణం : సిపిఎంచాపాడు : సమస్యల పరిష్కారం కోసం ఐదు రోజులుగా విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న వారిని పరామర్శించడం కోసం వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దారుణమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. మైదుకూరు, ప్రొద్దుటూరు అంగన్వాడీ కార్యక ర్తలను మార్కాపురం, మల్లేపల్లి ప్రాంతాల దగ్గర వాహ నాలు ఆపి పోలీసులు అరెస్టులు చేసి అర్ధరాత్రి సమ యాల్లో స్టేషన్‌కు తీసుకెళ్లి నోటీసులు ఇవ్వడం దుర్మార్గ మన్నారు. మైదుకూరులో అంగన్వాడీ కార్యకర్తలను రాత్రి పూర్తిగా స్టేషన్‌లో నిర్బందించడం హేయనీ యమన్నారు. మైదుకూరుకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలను మల్లేపల్లి దగ్గర వాహనాన్ని అడ్డగించిన పోలీసులు మైదుకూరు డిఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారన్నారు. మహిళలను నిర్భందించడం అన్యాయం : సిఐటియు చలో విజయవాడకు వెళ్తున్న అంగన్వా డీలను అర్థరాత్రి 12 గంటల సమయంలో మైదుకూరు పోలీస్‌ స్టేషన్‌ తీసుకువెళ్లి నిర్బంధించడం అన్యాయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ ప్రకటనలో తెలిపారు. వెంటనే జిల్లా ఎస్‌పి జోక్యం చేసుకొని మహి ళలను ఇంటికి పంపాలని వారు కోరారు. బస్సులలో, రైళ్ల లో పోయే వారిని ఎక్కడికి ఎక్కడ నిర్బంధించడం, వెనక్కి తీసుకొచ్చి పోలీస్‌ స్టేషన్‌లలో పెట్టడం దారుణమన్నారు. వైసిపి పతనం తప్పదు బద్వేలు : అంగన్వాడీలపై నిర్బంధాలు విధించి అక్రమ అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని, అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పతనం తప్పదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్‌ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అక్రమ అరెస్టులను ఖండించాలి.. అంగన్వాడీల అక్రమ అరెస్టులను ప్రతి ఒక్క రూ ఖండిం చాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ ఉపాధ్య క్షులు షేక్‌, జహంగీర్‌బాష , సిపిఐ బద్వేల్‌ పట్టణ కార్య దర్శి పెద్దల్లపల్లి బాలు, సిపిఎం బద్వేల్‌ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పఠాన్‌ చాంద్‌ బాషా ,కాంగ్రెస్‌ పార్టీ బద్వేల్‌ ముస్లిం, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్‌ పేర్కొన్నారు. తక్ష ణమే అరెస్టు చేసిన అంగన్వాడీలను , వారి నాయకత్వాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్బంధం సరికాదు : డివైఎఫ్‌ఐకడప అర్బన్‌ : అంగన్వాడీల అక్రమ నిర్బంధం సరి కాదని డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం ఓబులేసు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని 42 రోజులుగా శాంతియుత పద్ధతిలో సమ్మె చేస్తున్నారని తెలిపారు. చలో విజయవాడకు బయలుదేరుతున్న అంగన్వాడడీ నాయకత్వాన్ని, కార్యకర్తలను అక్రమంగా అర్ధరాత్రి 12 వరకు పోలీస్‌ స్టేషన్‌లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర బంద్‌ జయప్రదం చేయండి.. రాష్ట్రవ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు 42 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగిస్తున్నదని, దీనిని నిరసిస్తూ ఈనెల 24న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమోహన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ లపై ఎస్మా ప్రయోగించడం, పోరాటాన్ని అడ్డుకోవడం, అక్రమంగా అరెస్టు చేయడం, పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించడం సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని తెలిపారు. రాష్ట్రవ్యాప్త బంద్‌కు ప్రజానీకం పెద్ద ఎత్తున సహకరించి విజయవంతం చేయాలని పేర్కొన్నారు. తొలగింపు అన్యాయం : ఎస్‌టియుపోరుమామిళ్ల : తమ న్యాయమైన డిమాండ్ల సాధనకోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఎస్‌టియు రాష్ట్రకౌన్సిలర్‌ పి.రమణారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుని, వారి సమస్యల పరిష్కారంపై దష్టిసారించాలన్నారు. అంగన్వాడీ వర్కర్ల అరెస్టు దుర్మార్గం : కాంగ్రెస్‌ కడప : అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను వైసిపి ప్రభుత్వం పోలీసులచే అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్‌ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

➡️