అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేయాలి

Dec 11,2023 21:17

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని ఒకటవ డివిజన్‌ పరిధిలోని అయ్యప్పనగర్‌ లో పూసర్ల మధు సూదనరావు అక్రమంగా నిర్వహిస్తున్న స్వాతీ ప్యూర్‌ఫైడ్‌ కూలింగ్‌ వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు,, అయ్యప్ప నగర్‌ పోరాట కన్వీనర్‌ యు ఎస్‌ రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్లాంట్‌కు భూగర్బాజల శాఖ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులెవరూ అనుమతులు ఇవ్వలేదని, అయినా అక్రమంగా నీటివ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని తెలిపారు. మరోవైపు అయ్యప్ప నగర్‌లో ఇళ్ల బోర్లు ఇంకిపోయి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న యజమాని పూసర్ల మధుసూదన రావును ఆరెస్ట్‌ చేయాలని , అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, ఎల్‌బిజి నగర్‌ కార్యదర్శి బి. రమణ, రామకృష్ణా నగర్‌ నుంచి జగన్‌ మోహన్‌ , గురజాడ నగర్‌ తరుపున కార్యదర్శి రంబ శ్రీను, అయ్యప్ప నగర్‌ కాలనీ అసోసియేషన్స్‌ కార్యదర్శి సుదీర్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంది త్రినాథ్‌ ఆయా సంఘాలు, కాలనీల తరుపున వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం, సిఐటియు నాయకులు టివి రమణ, సుధారాణి పాల్గొన్నారు.

➡️