అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా : డిసిసి

ప్రజాశక్తి – రాయచోటి ఇందిరమ్మ అభయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదాలనే కాంగ్రెస్‌ పార్టీ ప్రచార ఆస్త్రాలుగా మార్చుకుని ప్రతి మండల అధ్యక్షుడు సైనికుడిలా మారి రాహుల్‌ గాంధీని దేశ ప్రధానమంత్రిని చేయడానికి కషి చేయాలని డిసిసి అధ్యక్షుడు షేక్‌. అల్లాబకష్‌ అన్నారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షుడు జిల్లాలోని 30 మండలాలకు, రాయచోటి ఖాదర్‌ఖాన్‌, మదనపల్లి రెడ్డి సాహెబ్‌, రాజంపేట నరేష్‌ను పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ వారికి గురువారం డిసిసి కార్యాలయంలో నియామక పాత్రలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడూ న్యాయం పొందే వరకు న్యాయం కోసం పోరాడాలని అన్నారు.అనంతరం సమావేశంలో అన్నమయ్య డిసిసి మహిళా అధ్యక్షురాలు గోసాల దేవి, మదనపల్లి మదనపల్లి నియోజకవర్గం నియోజవర్గం నియోజకవర్గం కాంగ్రెస్‌ నాయకులు రెడ్డి సాహెబ్‌ రెడ్డి సాహెబ్‌ రెడ్డి సాహేబ దేశానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివద్ధి గురించి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు మహమ్మద్‌ రఫీ, కాంగ్రెస్‌ రాష్ట్ర ఎస్సీ సెల్‌ మాజీ కన్వీనర్‌ శాంతయ్య, పాల్గొన్నారు.

➡️