దోమల నివారణపై జాగ్రత్తలు పాటించాలి

Jun 20,2024 22:25
దోమల నివారణపై జాగ్రత్తలు పాటించాలి

మాట్లాడుతున్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌
దోమల నివారణపై జాగ్రత్తలు పాటించాలి ప్రజాశక్తి-కోవూరు:ఎస్‌సి, ఎస్‌టి కాలనీలో దోమల నివారణపై తగు జాగ్రత్తలు పాటించాలని కాలనీవాసులకు కొడవలూరు అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ ఎస్‌ నిర్మల అవగాహన కల్పించారు మండలంలోని మేనంగుంట మూలకట్ట సంఘంలో నివసిస్తున్న గిరిజనులకు దోమల నివారణ పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతి గృహాల్లో అపరిశుభ్రతను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు పరిసర ప్రాంతాల్లో మందు పిచికారి చేయించాల్సి ఉంటుందన్నారు రానున్న వర్షాకాలం కావడంతో మురుగునీటి నిల్వలు పేరుకు పోయి దోమల బెడద ఉంటుందన్నారు. దోమల బారిన పడకుండా మస్కట్‌ కాయిల్స్‌ వాడాలని సూచించారు. కార్యక్రమంలో కార్యకర్త శాంతి, .చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️