అధునాతన విధానాల ద్వారా వైద్య సేవలు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: అధునాతన విధానాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్‌ పి రామ చంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం నరసరావు పేటకు చెందిన మాతాశ్రీ హాస్పటల్‌ ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని ముస్లిం షాదీఖానాలో యర్రగొండపాలెం ఏరియా గ్రామీణ వైద్యులకు వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. కడుపు నొప్పి, హెర్నియా, సుంతి తదితర శస్త్ర చికిత్సలను చేసే విధానాన్ని వివరించారు. అలాగే గ్యాస్‌ట్రబుల్‌ వ్యాధులపై అవగాహన కల్పించారు. గ్యాస్‌ట్రబుల్‌ ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంకా మాతాశ్రీ హాస్పటల్‌ ఎండి సుబ్బారెడ్డి, యర్రగొండపాలెం ఏరియా గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జాషువ, యు మల్లికార్జునరావు, కోశాధికారి పి ఇస్మాయిల్‌ ఖాన్‌ మాట్లాడారు. అనంతరం ఏయే వ్యాధులకు లాప్రోస్కోపి ద్వారా శస్త్రచికిత్సలు ఏ విధంగా చేస్తారు అనే దానిని ప్రొజెక్టర్‌ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండ పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాలకు చెందిన గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

➡️