అన్నీ ప్రజలు గమనిస్తున్నారు

Mar 2,2024 21:33

 ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : ఏ ప్రభుత్వ హయాంలో ఎంత మేలు జరిగిందో ప్రజలన్నీ గమనిస్తున్నారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు తెలిపారు. శనివారం జగనన్న ఇంటి స్థల హక్కు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఏవైతే చెప్పారో చేసి చూపించిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికి దక్కిందని చెప్పారు. ఇంటి స్థలంతోపాటు ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో ఏ ఒక్కరికైనా సెంటు భూమి ఇచ్చారా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసిపికి బ్రహ్మరథం పట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️