అప్రెంటిస్‌ విధానం పునరుద్ధరణ దుర్మార్గం

Feb 13,2024 00:32

గుంటూరులో నిరసన తెలియజేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు, మంగళగిరి :
సుదీర్ఘకాలం పోరాడి రద్దు చేయించుకున్న అప్రంటిస్‌ విధానాన్ని తిరిగి మళ్లీ ప్రవేశ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకోవాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుత డీఎస్సీ లో అప్రంటిస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ యుటి ఎఫ్‌ ఆధ్వర్యంలో సోమవారం డిఇఒ కార్యాలయం ఎదుట నిరసన తెలిసి నోటిఫి కేషన్‌ ప్రతుల్ని దహనం చేశారు. ఈ సందర్భ ంగా యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్‌ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధ్యా య పోస్టుకు అవసరమైన విద్యార్థులతో, ఉపాధ్యాయ శిక్షణ పొంది, టెట్‌, డిఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు, ఉద్యోగం ఇచ్చాక మళ్లీ అప్రెంటిస్‌ పేరుతో వెట్టిచాకిరీ చేయించటం సరికాదన్నారు. జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 15 ఏళ్లపాటు పోరాడి, సెలవులు త్యాగం చేసి, కేసులు భరించి అప్రెంటిస్‌ రద్దు చేయించుకుంటే ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించటం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సిహెచ్‌.ఆదినా రాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.కోటిరెడ్డి, కె.ప్రేమ్‌కుమార్‌, కె.ప్రభూజీ, ఎమ్‌డి షకీలాబేగం, చంద్రశేఖర్‌, చిన్నయ్య, మరియన్న, వినోద్‌ పాల్గొన్నారు. మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో నిరసన తెలిసి నోటిఫికేషన్‌ కాపీలను దహనం చేశారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు యు.రాజశేఖర్‌, టి.ఆంజనేయులు, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ అడివి శ్రీనివాసరావు, ప్రాంతీయ శాఖ బాధ్యులు సిహెచ్‌ సత్యశివ నాగేశ్వరావు, సుబ్రహ్మణ్యం, టి.భాస్కరరావు, సుబ్బారావు, రాధాకృష్ణ, రాంబాబు, ఇందుమతి, వీరకుమారి, పుష్పవతి పాల్గొన్నారు.

➡️