బాల్య వివాహాలు చేస్తే జైలుకే!

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: బాల్య వివాహాలు చేస్తే జైలు శిక్ష తప్పదని సార్డ్స్‌ ఎన్జీవో సంస్థ ఏపిఎం మందా మరియబాబు అన్నారు. మగళవారం యర్రగొండపాలెం మండలంలోని మురారిపల్లి, పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెం, చాపలమడుగు గ్రామాల్లో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మరియబాబు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం ద్వారా ఎదుర్కొనే సమస్యలు, కలిగే నష్టాల పట్ల అవగాహన కల్పిం చారు. బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిస్తే 1098 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలియజేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. బరువు తక్కువ పిల్లలను గుర్తించి ఆరోగ్య విషయంలో అవగాహ న కల్పించాలన్నారు. ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో మంచి నీరు, బాత్‌ రూములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేెర్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌బాబు, సార్డ్స్‌ సంస్థ ప్రతినిధులు భాగ్యలక్ష్మి, ధర్మానాయక్‌, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️