అభివృద్ధికి కృషి చేస్తా : అదితి

Feb 26,2024 21:41

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : పినవేమలి గ్రామ అభివద్ధికి శక్తి వంచన మేరకు కృషి చేస్తానని విజయనగరం టిడిపి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తెలిపారు. సోమవారం పినవేమలి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చ బండ కార్యక్రమంలో రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన అరాచక పాలనకు చరమగీతం పాడాలన్నారు టిడిపి-జనసేన కలయికలో వస్తున్న ప్రభుత్వం ప్రజల కోసం, ప్రగతి కోసం అందరూ ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బిసి నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, పట్టణ నాయకులు అవనాపు విజరు, జనసేన మండల అధ్యక్షులు బొబ్బాది చంద్ర నాయుడు మండల, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

ధర్మపురిలో జయహో సభ

నగరంలోని ధర్మపురిలో సోమవారం టిడిపి ఆధ్వర్యాన జయహో బిసి సభ నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ హయాంలో బిసిలకు జరుగుతున్న అన్యాయం, దాడుల గురించి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతి వివరించారు. బిసి నాయకులు, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టిడిపి – జనసేన పార్టీలకు మద్దతుగా బిసిలందరూ నిలిచి అదితి విజయలక్ష్మి గజపతి రాజును గెలిపించాలని నాయకులందరూ కోరారు.

➡️