అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Dec 16,2023 20:42

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని వివిధ ప్రాంతాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్‌ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న పశువుల కొట్టాంకు, కొత్త అగ్రహారంలో 8 లక్షలతోనూ రహదారులు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర అభివృద్ధే ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి సలహాలు, సూచనలతో కృషి చేస్తున్నామన్నారు. నగరంలో విచ్చలవిడిగా పశువుల సంచారాన్ని అరికట్టేందుకు పశువుల కొట్టాంను కొత్తపేటలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, రహదారులు, విద్యుత్తు దీపాలు వంటి అవసరాలను తీరుస్తూ నగరానికి అందాలను తెచ్చే ప్రధాన జంక్షన్ల అభివృద్ధి చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌, నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️