అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ప్రజాశక్తి- డెంకాడ : కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరై చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని ఎంపిపి బంటుపల్లి వెంకటవాసుదేవరావు కోరారు. గురువారం మండలంలోని చొల్లంగిపేట, డి.కొల్లాం గ్రామాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పనులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 నుంచి 18 వరకూ ఈ కార్యక్రమాన్ని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులతో అభివృద్ధి పనులపై సమన్వయం చేసుకుని పనులను పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిప పిన్నింటి తమ్మినాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూపారాణి, ఎపిఎం విజయలక్ష్మి, ఎపిఒ వెంకటరమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మీసాల శివరామకృష్ణ, సర్పంచ్‌ కోరాడ కనకరాజు, ఎంపిటిసి కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రవేపాడ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పై ఈ నెల 8 నుంచి 13 వరకూ గ్రామాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర పేరిట ప్రచారం చేస్తామని ఎంపిడిఒ పట్నాయక్‌ తెలిపారు. 8న వేపాడ, వల్లంపూడి,9న వీలుపరితి, వావిలపాడు, 10న నల్లబెల్లి, ఎన్‌కెఆర్‌పురం, 11న బల్లంకి, బానాది, 12న కుంపల్లి, కెఆర్‌ పేట, 13న డిఆర్‌ పేట, ఏఎస్‌పేట సచివాలయాల వద్ద సభలు పెడతామన్నారు. వాహనంపై డిజిటల్‌ స్క్రీన్‌ అమర్చి ప్రతి గ్రామంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గూర్చి వివరిస్తామన్నారు.

➡️