అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలి : మానుగుంట

Dec 2,2023 20:50
ఎంఎల్‌ఎ సమక్షంలో వైసిపి చేరుతున్న మాజీ కౌన్సిలర్‌

ఎంఎల్‌ఎ సమక్షంలో వైసిపి చేరుతున్న మాజీ కౌన్సిలర్‌
అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలి : మానుగుంట
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌, సీనియర్‌ నాయకుడు పాశం పాకనాటయ్య ఎంఎల్‌ఎ మానుగుంట మహీధరరెడ్డి సమక్షంలో వైసిపిలో శనివారం చేరారు. కందుకూరు ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పాకనాటయ్య వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంఎల్‌ఎ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం అభివద్ధి కోసం అందరూ భాగస్వామి కావాలని గతంలో నిస్వార్థంగా రాజకీయాలు చేసిన సీనియర్‌ నాయకులు అంతా కలిసి రావాలన్నారు. పాశం పాకనాటయ్యకు పార్టీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసిపి సీనియర్‌ నాయకులు పాశం కొండయ్య, కష్ణ బలిజ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పాశం కుమారి, సచివాలయం కన్వీనర్‌ భోగిశెట్టి దత్తాత్రేయ, పాశం భూపతి, పసుపులేటి దత్తాత్రేయ, జె సి యస్‌ కో ఆర్డినేటర్‌ ముప్పవరపు కిషోర్‌ ఉన్నారు.

➡️