అభివృద్ధి, సంక్షేమానికి ఓటెయ్యండి

Apr 2,2024 20:54

ప్రజాశక్తి – పూసపాటిరేగ : ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధి, సంక్షేమానికి ఓటేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్ధి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని గుంపాం, తొత్తడాం గ్రామాల్లో వైసిపి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలు అందించే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. మరోసారి నెల్లిమర్ల వైసిపి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ను ఆశీర్వదించాలన్నారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేందుకు ఈ ప్రభుత్వం మరలా రావాలన్నారు. ప్రచారంలో వైసిపి మండల అధ్యక్షలు పతివాడ అప్పలనాయుడు, వైస్‌ ఎంపిపిలు రమేష్‌, ఎన్‌. సత్యనారాయణరాజు, జెసిఎస్‌ కన్వినర్‌ మహంతి శ్రీనివాసరావు, గుంపాం నాయకులు యడ్ల రామకృష్ణ, నాయకులు మహంతి జనార్దనరావు, పుప్పాల లక్ష్మినారాయణ, దేశెట్టి గణేష్‌, పట్టెపు శ్రీనువాసరావు, పిన్నింటి యల్లంనాయుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️