అర్హులందరికీ పథకాలు

ప్రజాశక్తి-సీతానగరం: అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నట్లు ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. గురువారం మండలంలోని పెదబోగిలిలో రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రవణమ్మ శ్రీరాములు నాయుడు, జెడ్‌పిటిసి ఎం.బాబ్జి, ఎంపిటిసిలు సురగాల గౌరీ కిరణ్‌, జి.కుసుమ సూర్యనారాయణ, వైసిపి మండల అధ్యక్షులు బి.చిట్టి రాజు, ఆర్‌వి పార్థసారథి, నాయకులు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : మండలంలోని పుట్టూరు సచివాలయ పరిధిలో గురువారం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యాన ఎందుకు జగనే కావాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ పరిధిలో ఇంతవరకు 48.58 కోట్ల రూపాయల మేర ప్రత్యక్షంగా, పరోక్షంగా, స్థానిక అభివృద్ధి కోసం ప్రభుత్వం వెచ్చించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచి గుంట్రెడ్డి సతీష్‌ కుమార్‌, ఎంపిపి మజ్జి శోభారాణి, జెడ్‌పిటిసి బలగ రేవతమ్మ, వైస్‌ ఎంపిపి బి.రవికుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు బి.కృష్ణమూర్తి, మజ్జి శేఖర్‌, సర్పంచ్‌ సంపంగి జగదీష్‌, పాల్గొన్నారు.

➡️