అర్హులకు పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

తిళ్లకుప్ప సచివాలయంలో డిజిటల్‌ బోర్డు ఆవిష్కరిస్తున్న సర్పంచ్‌ తమ్మయ్య

ప్రజాశక్తి-ఐ.పోలవరం

వైసిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలుచేసిన సంక్షేమ పథకాలను రాష్ట్ర నాయకులు కోరుకొండ సత్యనారాయణ, ఎంపిపి మోర్తరాణి మిరియం జ్యోతి, జెడ్‌పిటిసి సభ్యులు. ముదునూరి.సతీష్‌ రాజు ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయమని అన్నారు. మండలంలోని తిళ్లకుప్ప,ఎదుర్లంక సచివాలయం వద్ద ఏపి కి జగన్‌ ఎందుకు కావాలి పల్లెకు పోదాం రా కార్యక్రమం మంగళవారం వైసిపి గ్రామ కమిటీ అధ్యక్షులు ముదునూరి సురేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్‌ పిన్నమరాజు వెంకట పతిరాజు మాట్లాడుతూ అర్హులైన తిళ్లకుప్పలో అర్హులైన వారికి పార్టీలకు అతీతంగా డిపిటి ద్వారా రూ.25.14 కోట్లు, అర్హులైన ఎదుర్లంక ప్రజలకు డిపిటి ద్వారా రూ.18.44 కోట్లు ఇవ్వటం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయా లని కోరారు. ముందుగా మా నమ్మకం నువ్వే జగన్‌ జెండాను ఆవిష్క రించారు. అనం తరం డిజిటల్‌ సంక్షేమ పథకాలు బోర్డు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కడియం తమ్మయ్య, కొమరగిరి సొసైటీ ఛైర్‌పర్సన్‌ ఏలూరి ఆదినారాయణ, సర్పంచ్‌ మోర్త రాఘవులు, రేవు సత్యనారాయణ, మీసాల అంజి, దుక్కుపాటి శశికళ, చెల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️