గర్భిణుల వసతి గృహానికి వైద్య పరికరాలు వితరణ

Jun 25,2024 21:37

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : స్థానిక వైటిసిలో నిర్వహిస్తున్నట్టు గర్భిణుల వసతి గృహంలో ఉంటున్న గర్భిణులకు పండ్లు, వైద్య పరికరాలు జనసేన తరుపున గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు, అక్షయ ఫౌండేషన్‌ చైర్మన్‌, కన్స్ట్రక్షన్స్‌ అధినేత ఏగిరెడ్డి తిరుపతి నాయుడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్‌ కడ్రక మల్లేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి నాయుడు మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా నిరుపేద గిరిజన గర్బిణులకు గృహాన్ని నారా చంద్రబాబు నాయుడు 2018లో ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటి వరకూ 1900 మంది గర్భిణులకు సుఖ ప్రసవాలు జరగడం అభినందనీయమని అన్నారు. ఇన్‌ఛార్జి మల్లేష్‌ వసతిగృహంలో ఉన్న గర్భిణులకు పోషకాహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి తగు సూచనలు చేశారు. మున్ముందు ఈ వసతిగృహానికి అక్షయ ఫౌండేషన్‌ నుంచి గర్భిణులకు విద్యుత్‌ అంతరాయం లేకుండా ఇన్వర్టర్‌ కూడా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గరుగుబిల్లి మండల జనసేన అధ్యక్షులు శంకర్రావు, అధికారి అనిల్‌, యువత శిక్షణ కేంద్రం మేనేజర్‌ అన్ను రాము, సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు.

➡️