అర్హులను గుర్తించి ఓటర్లుగా చేర్చండి

Nov 28,2023 22:04
మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
అర్హులను గుర్తించి ఓటర్లుగా చేర్చండి
…ప్రజాశక్తి-నెలూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులు అందరిని గుర్తించి, సంబంధిత ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటరు జాబితాలో చేర్పించాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ ఎన్నికల విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల విభాగం అధికారులు, సూపర్వైజర్లు, ఎలక్షన్‌ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కార్యాలయంలోని డాక్టర్‌. ఏ.పీ.జే. అబ్దుల్‌ కలాం సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్‌ 9వ తేదీ వరకు సిటీ నియోజకవర్గ పరిధిలో అన్ని సచివాలయాలలో అర్హులైన ఓటర్ల నుంచి ఫారంలను సేకరించాలన్నారు. లింగ నిష్పత్తి అంచనాలను సమం చేస్తూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాట్‌ ట్రేసబుల్‌, మ్యారీడ్‌ విమెన్‌ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలన్నారు. డబల్‌ ఎంట్రీలు లేకుండా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఎన్నికల సిబ్బందిని సూచించారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా ఫారం 6 ద్వారా చేస్తున్న చేర్పులపై చర్యలను ఆయన ఆడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు ముసాయిదా జాబితాలో మార్పు చేర్పులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్‌.ఓ. లు దేవి కుమారి, నిర్మలానంద బాబా, శ్రీనివాసులు, దశయ్య,మాధవి, సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.

➡️