అవ్వా తాతలను ఆదుకున్న ప్రభుత్వం

Jan 5,2024 21:51

ప్రజాశక్తి-రేగిడి  :  అవ్వా తాతలకు పెద్ద కొడుకుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదుకుంటున్నారని జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండలంలోని అంబకండి గ్రామంలో పెంచిన రూ.3 వేల పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీచేశారు. ముందుగా జగన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. వైసిపి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ తలే రాజేష్‌కు అంతా మద్దతు తెలపాలని ఆయన కోరారు. అనంతరం హెల్త్‌ క్లీనిక్‌ను ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, తలే రాజేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపిలు టంకాల అచ్చెన్నాయుడు, వి.జగన్మోహన్‌ రావు, వైసిపి నాయకులు కింజరాపు సురేష్‌ కుమార్‌, లెంక రాంబాబు, శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి సిరిపురం జగన్మోహనరావు, సోషల్‌ మీడియా కన్వీనర్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపిడిఒ శ్యామలకుమారి, ఇఒపిఆర్‌డి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి హేమ సుందర్‌ రావు పాల్గొన్నారు.

పూసపాటిరేగ : ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి జగనేనని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని నూతనంగా మంజూరైన 168 పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రూ.3 వేలు పింఛను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి మహంతి కళ్యాణి, జెసిఎస్‌ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఉపాధ్యక్షులు పుప్పాల లకీëనారాయణ, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు బర్రి చిన్నప్పన్న, వైఎస్‌ ఎంపిపి ఎన్‌.సత్యనారాయణ రాజు, పిఎసిఎస్‌ చైర్మన్‌ మహంతి లక్ష్మణరావు, నాయకులు మహంతి జనార్ధనరావు, దాడిశెట్టి త్రినాథరావు, యడ్ల రామకృష్ణ, గుజ్జు సురేష్‌రెడ్డి, పడాల శ్రీధర్‌, ఎస్‌.శ్రీనివాసరావు, సర్పంచి టి.సీతారాం, ఎంపిడిఒ రాధిక, తహశీల్దార్‌ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలి : పట్టణంలోని పదో సచివాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీకష్ణ, వైస్‌ చైర్మన్‌ చెలికాని మురళి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు.వేపాడ : మండలంలో కుంపల్లి, కెఆర్‌పేట, వీలుపర్తి, వేపాడ, ఆతవ, సింగరాయి, డి.ఆర్‌.పేట, వల్లంపూడి గ్రామాల్లో పెంచిన పింఛన్లను ఎంపిపి డి.సత్యవంతుడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటరావు, సర్పంచులు ఎల్‌.అరుణ, సిహెచ్‌ ముసలినాయుడు, మెల్లిపాక అర్జునమ్మ, రుద్ర అంజలి, డి.ముత్యాలమ్మ, ఎన్‌.వెంకటరావు, పంచాయతీ కార్యదర్శులు కమల, బి.గౌరి, ధనలక్ష్మి, కన్నమ నాయుడు, వైసిపి మండల అధ్యక్షులు జగ్గు బాబు పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలో ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు వాకాడ రాంబాబు, కూనిరెడ్డి వెంకటరావు, మోపాడ కుమార్‌, రంది అనంత్‌, ఎంపిడిఒ శేషుబాబు, బుగత వెంకటేశ్వరరావు, ఎం.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

లక్కవరపుకోట : నూతనంగా ఎంపికైన లబ్ధిదారులకు ఎంపిపి గేదెల శ్రీనివాసరావు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మల్లివీడు పంచాయతీలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సందర్శించారు. వికలాంగులైన బూసాల సత్యరాజ్‌, బొడ్డు చల్లయ్య, కెల్ల సూరికి విద్యుత్తు ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లివీడు సర్పంచ్‌ ఆదిరెడ్డి అర్జున్‌, వైసిపి నాయకులు జామి రాజు, గేదెల విజయకుమార్‌, అమనాపు శ్రీనివాసరావు, పెదిరెడ్ల వెంకటేష్‌, జామి ఈశ్వరరావు, కసిరెడ్డి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి అల్లు సుభద్ర పాల్గొన్నారు.

నెల్లిమర్ల : ప్రజా సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో పెంచిన రూ.3 వేల పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం వైకెపి ఆధ్వర్యంలో ఉన్నతి పథకం కింద ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి గుషిని గ్రామానికి చెందిన మానాపురం లక్ష్మికి ఆటోను అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, నగర పంచాయతీ చైర్మన్‌ బంగారు సరోజినీ, వైస్‌ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ వెంకట కృష్ణారావు, డిసిసిబి వైస్‌ ఛైర్మన్‌ చనమల్ల వెంకట రమణ, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపి పి.సత్యనారాయణ, వైసిపి పట్టణ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రేగాన శ్రీనివాసరావు, తుమ్మలపేట పిఎసిఎస్‌ అధ్యక్షులు కోట్ల పైడినాయుడు, ఎంపిడిఒ జి.రామారావు, కమిషనర్‌ పి. బాలాజీప్రసాద్‌, గరివిడి ఏరియా కోఆర్డినేటర్‌ బంగారమ్మ, ఎపిఎం ఎల్‌.సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️