ఆకట్టుకుంటున్న నంది నాటకోత్సవాలు

 రాతిలో తేమ నాటకంలో ఓ సన్నివేశం
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలలో భాగంగా ఐదో రోజు బుధవారం ఏడు నాటికలను ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, పలువురు జిల్లా అధికారులు ఈ నాటికలను వీక్షించారు. ప్రేక్షకులు కూడాపెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీకాంత కష్ణమాచార్యులు ప్రపంచతంత్రం, విజ్ఞాన భారతం, అతీతం, కపిరాజు, కొత్తపరిమళం, రాతిలో తేమ నాటికలు ఆకట్టుకున్నాయి. నంది నాటక పోటీల బహుమతి ప్రదానం సభ డిసెంబరు 29 శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుందని రాష్ట్ర చలనచిత్ర టివి నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.విజరుకుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరుగుతున్న నాటక పోటీల విజేతల వివరాలు ప్రకటించి, వారికి 73 స్వర్ణ రజిత కాంస్య నందులు ప్రదానం చేస్తామని, ఎన్టీ ఆర్‌ రంగస్థల పురస్కారం, డావైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కార గ్రహీతలకు ఇదే వేదికపైన అవార్డు ప్రదానం చేస్తారని చెప్పారు.

➡️