ఆక్రమణల తొలగింపు

Jan 9,2024 21:19

ప్రజాశక్తి-శృంగవరపుకోట : పట్టణంలోని చెరుకు కాటా వద్దగల గెడ్డ పోరంబోకు భూమిని కొందరు ఆక్రమించి పాకలు నిర్మించారు విషయం తెలుసుకున్న తాహశీల్దార్‌ సంఘటన స్థలానికి జెసిబితో వెళ్లి వాటిని మంగళవారం తొలగించారు. ఆక్రమితుదారులు తమకు న్యాయం చేయాలని, ఇంటి అద్దెలు కట్టలేక పాకలు వేశామని మొరపెట్టుకున్నారు. తహశీల్దార్‌ స్పందిస్తూ దరఖాస్తు చేసుకుంటే 90 రోజులు స్కీం కింద జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని బాధితులకు తెలిపారు హెచ్చరిక బోర్డులు తొలగించి పభుత్వ స్థలాలు కబ్జా బొబ్బిలి : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ. ఐటిఐ కాలనీలో భూకబ్జాలపై గతంలో స్పందించిన రెవెన్యూ యంత్రాంగం ఆ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని, కానీ భూకబ్జాదారులు అధికార పార్టీ నాయకులు పేర్లు చెప్పుకొని ఆ బోర్డులను పక్కనపెట్టి యథాతదంగా ఇళ్ల కట్టడాలు చేపడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు. మున్సిపల్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు మామూలు చెల్లించి అధికార పార్టీ నాయకుల అండదండలతో రెవెన్యూ, మున్సిపల్‌ యంత్రంగాలకే చుక్కలు చూపెడుతున్నారని ఆరోపించారు. ఎటువంటి ఇళ్ల స్థలాలు కబ్జాలు జరగలేదని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పి వారం రోజులు గడవకముందే భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ భూ కబ్జాలపై త్వరలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సమావేశంలో కోట అప్పన్న, బొద్దాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️