ఆటల పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌ : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆడుదాం, ఆంధ్ర పోటీలను బుధవారం నిర్వహించారు. ఈ పోటీలను ఎంపిడిఒ రామచంద్రరావు, తహశీల్దారు నాగుల్‌ మీరా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి ఆలయ ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, వైస్‌ఆర్‌టియుసి జిల్లా అధ్యక్షుడు మేకల చిన్న తిరుపతి, సచివాలయ మండల కన్వీనర్‌ అధ్యక్షుడు బైరెడ్డి తిరుపతిరెడ్డి, రాగసాని పుల్లయ్య, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.కనిగిరి : ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రికెట్‌ పోటీలను మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మాణిక్యరావు, వైసిపి నాయకుడు దాసరి మురళీకష్ణ ,క్రీడాకారులు ప్రజలు పాల్గొన్నారు.పెద్ద దోర్నాల : ఆడుదాం ఆంధ్ర పోటీలను ఎంపిపి గుమ్మా పద్మజ యల్లేష్‌, సర్పంచ్‌ చిత్తూరి హారిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి జగన్నాధరావు, ఎంపిడిఒ నాసర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి దర్శనం నాగయ్య, ఉప సర్పంచి రసూల్‌, ఓంటేరు రమణ, మందగిరి వర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.యర్రగొండపాలెం : ఆడుదాం అంధ్ర పోటీలను ఎంపిపి దొంతా కిరణ్‌ గౌడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి చేదూరి విజయభాస్కర్‌, సర్పంచి రామావత్‌ అరుణాబాయి, ఎంఇఒ ఆంజనేయులు, వైసిపి మండల కన్వీనర్‌ కొప్పర్తి ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️