ఆటల పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-పిసిపల్లి: మండలంలోని దివాకరపురంలో కనిగిరి నియోజకవర్గ స్థాయి క పోటీలను ఎస్‌ఐ జి కోటయ్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటయ్య మాట్లాడుతూ ఆటలు శారీరక దారుఢ్యంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. కబాడీ ఆడే సమయంలో స్నేహపూరిత వాతావరణంలో ఉండాలన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. మొదటి ప్రధమ బహుమతి రూ.15116లను కోయ వెంకటేశ్వర్లు అందజేస్తారని తెలిపారు. ఒంగోలులోని ప్రముఖ వైద్యశాల, చైతన్య హాస్పెటల్‌ అధినేత డాక్టర్‌ చైతన్య ద్వితీయ బహుమతి రూ.10,116లను అందజేయనున్నట్లు తెలిపారు. తృతీయ బహుమతి కోటపాటి కోటయ్య రూ.5116లు అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం నియోజకవర్గ స్థాయిలో 16 టీములు పాల్గొన్నట్లు నిర్వహకులు చీమలదిన్నె గోవిందయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కె.శ్రీనివాసరెడ్డి, జెసిఎస్‌ కన్వీనర్‌ శీలం సుదర్శనం, నిర్వహకులు వజ్రాల మాచర్ల, నీలం చింటూ, సీలం రాము తదితరులు పోటీలను నిర్వహించారు.

➡️