ఆటోను ఢీకొన్న వాటర్‌ ట్యాంకర్‌.. పలువురికి తీవ్ర గాయాలు

Feb 23,2024 16:40 #karnool

ప్రజాశక్తి -కర్నూలు క్రైమ్‌ :కర్నూల్‌ నగరంలో నంద్యాల చెక్పోస్ట్‌ సమీపంలో ప్రైవేటు వాటర్‌ ట్యాంకర్‌ ఆటోను ఢీకొని పలువురుకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కల్లూరు నుంచి వెంకయ్య పల్లె ఎల్లమ్మకు సంధ్యా శ్యామల,పింటూ మరో ఇద్దరు పిల్లలతో ఆటోలో బయలుదేరారు. కర్నూలు మండలం నూతన పల్లెకు చెందిన ఆటో డ్రైవర్‌ వీరిని బాడుగకు ఎక్కించుకున్నాడు. ఆటో నంద్యాల చెక్పోస్ట్‌ ను దాటి వినాయక గుడి వద్దకు చేరుకోగానే నందికొట్కూరు వైపు నుంచి కర్నూలు వైపు వస్తున్న వాటర్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ను డ్రైవర్‌ అకస్మాత్తుగా మలుపు తిప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆటోను ఢీకొనడంతో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పింటూకు కుడికాలు విరిగింది. సంధ్య, శ్యామలకు రక్త గాయాలయ్యాయి. ఆటో డ్రైవరు, పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఘటన స్థలంలో వద్ద ఉన్న పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి తన బఅందంతో కలిసి అటుగా వెళుతున్న అంబులెన్స్‌ ను పిలిచి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

➡️