ఆట స్థలాలను అభివృద్ధి చేయండి

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : అభివృద్ధి చేయకుండా ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాలను ఎలా చేపడతారని జిల్లా అధ్యక్షులు తెలుగు యువత రావిపాటి సాయికృష్ణ ఆరోపించారు. ‘ఆడుదాం ఆంధ్ర సరే..ఆడటానికి ఆట స్థలం ఏది…’ అంటూ గుంటూరులో బి ఆర్‌ స్టేడియాన్ని శిథిలావస్థకు చేర్చి అభివృద్ధి పరచకపోవడం పై పలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, ఎఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ వళి,ఎన్‌ఎస్‌ యుఐ జిల్లా అద్యక్షులు సయ్యద్‌ కరీం,యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్‌ తేజ తదితరులు మాట్లాడారు. ‘అడుగుదాం ఆంధ్ర’ పేరుతో ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగు యువత, జనసేన, ఎఐవైఎఫ్‌ ,యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యు, యువజన సంఘాలతో కూడిన బృందం గుంటూరులో శిథిలావస్థకు చేరిన కాసు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ను పరిశీలించారు. ఆడియన్స్‌ లాంజ్‌ లలో పెరిగిన జమ్మి,పిచ్చి మొక్కలను తొలగించారు. లోపల ఉన్న పశువులను బయటకు తోలి నిరసన తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేయకుండా ఇప్పుడు ఎన్నికల కోసం ‘ఆడుదాం ఆంధ్రా’ చేపట్టారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి పేరుతో ఉన్న పెద్ద క్రీడామైదానాన్ని పాడుపెట్టి ప్రైవేట్‌ సంస్థల స్థలంలో ఆటలపోటీల ప్రారంభానికి ముఖ్యమంత్రి రావటం సిగ్గు చేటని అన్నారు. తెలుగుయువత జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ నాగుల్‌ మీరా బాబు ,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాస్‌ రావు,జిల్లా కార్యదర్సులు ఇ.త్రినాథ్‌,పఠాన్‌ అథావుల్లా ఖాన్‌, తెలుగుయువత నాయకులు పి.రాంబాబు, ఎస్‌.అనిల్‌, సింగు నాగమల్లేశ్వరావు, సంపత్‌, టిడిపి నాయకులు షేక్‌ ఉమైన్‌ అక్బర్‌ ,కొల్లి నాగుల్‌,ఉపెంద్ర, యువజన కాంగ్రెస్‌ నాయకులు ఛార్లెస్‌ ప్రదీప్‌, షేక్‌ మహమూద్‌, రాజు పాల్గొన్నారు.

➡️