‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలు

Nov 27,2023 19:27
పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జెసి

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న జెసి
‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలు
ప్రజాశక్తి -నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేలా ‘అడుదాం – ఆంధ్ర క్రీడలు’ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 2024, ఫిబ్రవరి 3వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్‌క కలెక్టర్‌ కూర్మనాథ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణంలో ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడల నోడల్‌ అధికారి ఆర్‌. కూర్మనాథ్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌, అదనపు నోడల్‌ అధికారి వికాస్‌ మర్మత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సంజనా సింహలతో కలిసి క్రీడోత్సవాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్ర పభుత్వం గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు డిశంబర్‌ 15వ తేదీ నుంచి 2024, ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహించనుందన్నాఉ. క్రికెట్‌, వాలీబాల్‌ బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖో-ఖో తదతర క్రీడలతోపాటు యోగ, టెన్నీ కాయిట్‌, మారధాన్‌ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 15 ఏళ్లు వయస్సు పై బడిన వారు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. జిల్లాలోని 768 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో 23,070 మ్యాచ్‌లు, మండల స్థాయిలో 39 మండలాల్లో 730 మ్యాచ్‌లు, 8 నియోజకవర్గాల స్థాయిలో 320 మ్యాచ్‌ లు, జిల్లా స్థాయిలో 70 మ్యాచ్‌లు మొత్తం అన్నీ స్థాయిల్లో కలిపి 24, 190 మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌ టి. బాపిరెడ్డి, జిల్లా పరిషత్‌ సి.ఇఒ బి. చిరంజీవి ఉన్నారు.

➡️