‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడాకారుల నిరాశ

Mar 14,2024 21:33

ప్రజాశక్తి – లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర తరుపున ఆడి గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వకపో వడంతో నిరాశ చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడాకారులను ప్రోత్సహిం చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్ర మానికి శ్రీకారం చుట్టారు. వివిధ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి, రెండు, మూడవ బహుమ తులుగా నగదును ప్రకటించారు. మొదట పంచాయతీల వారీగా ఎంపిక చేసి నియోజకవర్గస్థాయిలో ఆడించారు. లక్కవరపుకోట మండలం నుండి (ఎల్‌ కోట పంచాయతీ) మహిళల కబడ్డీ జట్టు నియోజకవర్గ స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. వీరికి రావలసిన రూ. 15వేలు ప్రోత్సాహం నగదును ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర తరఫున క్రీడలలో పాల్గొని గెలుపొందిన క్రీడాకారు లందరికి ప్రోత్సాహక నగదును అందజేసి ఇక్కడ గెలుపొందిన వారికి రాకపోవడంతో క్రీడాకారులు కే జయమ్మ, జె సత్య, జే రామలక్ష్మి, ఎస్‌ రూప, కే ధనలక్ష్మి, పి సమీర, పి దివ్య తదితరులు అసహనానికి గురవు తున్నారు. ఎన్నికల కోడ్‌ సమీపించక ముందే త్వరతిగతిన నగదు బహుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఆడనివారి పేర్లు కుడా కంప్యూటర్‌లో జనరేట్‌ చేసినట్లు విశ్వసి యమైన సమాచారం. ఈ విషయంపై ఎల్‌ కోట పంచాయతీ కార్యదర్శి ప్రసాదరావు వద్ద ప్రజాశక్తి ప్రస్తావించగా గెలుపొందిన క్రీడాకారులకు సంబంధించి బ్యాంకు వివరాలతో సహా కంప్యూటర్‌లో జనరేట్‌ చేశామని స్పష్టం చేశారు.

➡️