ఆడుదాం ఆంధ్ర క్రీడా కిట్లు పంపిణీ

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి జరిగే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కిట్లు శుక్రవారం పంపిణీ చేసినట్లు ఎంపిడిఒ కెఆర్‌ఎస్‌.కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. మండల వ్యాప్తంగా 11 సచివాలయలకు గాను క్రికెట్‌, కోకొ, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలకు సంబంధించి కిట్లను ఎంపిపి కోర్స పోసమ్మ, జెడ్‌పిటిసి వసంతరావు చేతుల మీదుగా పంచాయతీ సెక్రెటరీలకు అందజేసినట్లు ఆయన తెలిపారు. క్రీడలకు సంబంధించి సచివాలయాలలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ క్రీడలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్‌ అధికారిణి మంగతాయారు, ఇఒపిఆర్‌డి నిఖిల్‌ మధు శరణ్‌, పంచాయతీ కార్యదర్శి వీరలక్ష్మి, లక్ష్మి ప్రసన్న, ప్రసాద్‌, కన్నయ్య పాల్గొన్నారు.

➡️