‘ఆడుదాం ఆంధ్ర’ పై ర్యాలీ

ప్రజాశక్తి- బొబ్బిలి : ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై శనివారం పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకట మురళీ కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం, మండలంలో ఉన్న యువతి, యువకులు, 60 సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్రాలో పాల్గొనవచ్చునన్నారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ‘ఆడుదాం ఆంధ్రా’ అనే క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిందన్నారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, వాలీబాల్‌, ఖో ఖో ఆటలను ప్రమోట్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ యస్‌.శ్రీనివాసరావు, ఇఒపిఆర్‌డి భాస్కర్‌ రావు, మున్సిపల్‌ మేనేజర్‌ శివ ప్రసాద్‌, టిపిఆర్‌ఒ జగన్మోహన్‌ రావు, ఆర్‌ఒ ప్రసాద్‌, మున్సిపల్‌, సచివాలయ, మెప్మా సిబ్బంది, వార్డ్‌ వాలెంటీర్లు తదితరులు పాల్గొన్నారు.ఆడుదాం ఆంధ్రాపై సమీక్షపట్టణంలోని అన్ని సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలు, సచివాలయాల ఇన్చార్జిలు, నోడల్‌ ఆఫీసర్లు, పి.ఈ.టిలతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కమిషనర్‌ ఎస్‌. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రికెట్‌, ఖోఖో, షటిల్‌, వాలీబాల్‌, కబడ్డీ క్రీడల్లో స్త్రీలకు, పురుషులకు వేరువేరుగా టీములను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి క్రీడకు సంబంధించి ప్రతి ఒక్క సచివాలయం నుంచి రెండు టీములకు తక్కువ కాకుండా ఎంపిక చేయాలని ఆదేశించారు. ఎంపిక చేసిన టీములకు సంబంధించి ఆన్‌లైన్‌ షెడ్యూల్‌ అప్డేట్‌ చేయాలని ఆదేశించారు.మెంటాడ: మండల కేంద్రంలో శనివారం ‘ఆడుదాం ఆంధ్ర’పై వైస్‌ ఎంపిపి సారిక ఈశ్వరరావు, తెట్టంగి దుర్గ ఆధ్వర్యంలో మెంటాడ హైస్కూల్‌ నుండి ఎంపిడిఒ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట్‌ త్రీవినాగ్‌ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ టి రామకృష్ణ, ఎంపిడిఒ పి. త్రివిక్రమ్‌ రావు, ఎపిఎం వి సత్యనారాయణ, పొదుపు సంఘాల సభ్యులు, వాలంటీర్లు, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.వేపాడ: స్థానిక గ్రామ సచివాలయం నుండి వల్లంపూడి మండల పరిషత్‌ కార్యాలయం వరకు ఆడుదాం ఆంధ్ర పై శనివారం ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేకాధికారి లక్ష్మీనరసింహ, ఎంపిడిఒ పట్నాయక్‌, ఇఒపిఆర్‌డి ఉమా, పీడీలు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభించనున్న ఆటలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిపి డి. సత్యవంతుడు, జెడ్‌పిటిసి సేనాపతి అప్పలనాయుడు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛభారత్‌ కోఆర్డినేటర్‌, పాల్గొన్నారు.నెల్లిమర్ల: ఆడుదాం ఆంధ్రాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ జి.రామారావు, నగర పంచాయతీ కమిషనర్‌ పి.బాలాజీ ప్రసాద్‌ పిలుపునిచ్చారు. శనివారం నగర పంచాయతీలో ఆడుడాం ఆంధ్ర పై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను వెలికితీయడానికి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా అనే కార్యక్రమం చేపట్టిందన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో 15సంవత్సరాలు నిండి ఆసక్తి ఉన్న యువతీ యువకులను కార్యక్రమంలో చేర్పించ డానికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి కె.సింహాద్రి, నగర పంచాయతీ మేనేజర్‌ టివిఎస్‌ విశ్వేశ్వరరావు, ఎంఇఒలు యు. సూర్య నారాయణ మూర్తి, ఈపు విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.గజపతినగరం: గజపతినగరంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జెడ్‌పిటిసి గార తవుడు, ఎంపిపి బెల్లాన జ్ఞానదీపిక, బెల్లాన త్రినాధ్‌రావు పాల్గొన్నారు.

➡️