ఆదరించండి అభివద్ధి చేసి చూపుతాం

ప్రజాశక్తి-పీలేరు వైసిపి ప్రభుత్వాన్ని ఆదరించి జగన్మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివద్ధి బాటలో నడపడానికి అందరం తోడ్పాటు అందిద్దామని పీలేరు, కెవి పల్లి మండలాల వైసిపి ఎన్నికల బాధ్యులు పెద్దిరెడ్డి సుధీర్‌ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పద్మావతి నగర్‌లోని పలు వీధుల్లో గడప గడపకూ తిరిగారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివ ద్ధి ఫలాలు గురించి ప్రజలకు వివరించారు. వైసిపి నుంచి రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గానికి మూడోసారి ఎంపీగా పోటీ చేయనున్న ప్రస్తుత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి, పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలను ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి.వి.శ్రీనాథ్‌రెడ్డి, జిల్లా పంచాయితీ రాజ్‌ అభివద్ధి మండలి సభ్యులు డాక్టర్‌ షేక్‌ హబీబ్‌ బాష, పంచాయతీ సర్పంచ్‌ షేక్‌ జీనత్‌ షఫీ, వైసిపి రాష్ట్ర కార్యదర్శి హుమయూన్‌, జిల్లా పర్యాటక శాఖ అభివద్ధి మండలి సభ్యులు షాకీర్‌, కడప గిరిధర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపిలు పెద్దోడు, ఎంవి చలపతి, ఉదరు కుమార్‌, మునీర్‌, ఆబిద్‌, హబీబ్‌, విజరు శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️