ఆదర్శప్రాయలు ‘అంబేద్కర్‌’

Jan 9,2024 19:53
మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ విద్యాధరి

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ విద్యాధరి
ఆదర్శప్రాయలు ‘అంబేద్కర్‌’
ప్రజాశక్తి-కందుకూరు :అంబేద్కర్‌ భావజాలం అందరికీ ఆదర్శప్రాయమని సబ్‌ కలెక్టర్‌ విధ్యాదరి పేర్కొన్నారు. కందుకూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన అంబేద్కర్‌ సామాజిక న్యాయ సంవిధానం కార్యక్రమంలో భాగంగా మంగళవారం జరిగిన సభలో విధ్యాదరి మాట్లాడారు. అంబేద్కర్‌ సామాజిక న్యాయ మహా శిల్పం ఆవిష్కరణ సందర్భంగా చర్చా కార్యక్రమం జరిగింది. సాహిత్య సాంస్కతిక ప్రదర్శనలు నిర్వహించారు.జాషువా సాహిత్య సాంస్కతిక సంస్థ అధ్యక్షుడు ముప్పవరపు కిషోర్‌, కళ్యాణ భారతి అధ్యక్షుడు వి.వి.శేషయ్య,అన్నమయ్య కళా సమితి అధ్యక్షుడు ఇనకొల్లు మస్తానయ్య, మంచుపొగ కవి ఉమ్మడి శెట్టి నాగేశ్వరరావు,కవి సూరపోగు సహజానందం కవితా గానం చేశారు పొనుగోటి ప్రభాకర్‌ అలంకార విజయకుమార్‌, నూతలపాటి రామారావు,నూకతోటి వరమ్మ అంబేద్కర్‌ పై పాటలు ఆలపించారు. పంది నరశింహం డప్పు వాయిస్తూ వీనుల విందైన సంగీతం అందించారు. అంబేద్కర్‌ జీవితం సామాజిక న్యాయం అంశంపై ఉపాసకులు గాండ్లహరిప్రసాద్‌, గేరాచిరంజీవి, షేక్‌ అబ్దుల్లా పాలేటి సుచరిత, గోపనబోయిన నర్సయ్య, చనమాల కోటేశ్వరరావు,షేక్‌ రిజ్వాన్‌ తలారి ప్రసన్న కుమారి, రేణమాల అయ్యన్న, బిరుదుల సంధ్యారాణి తదితరులు తమ సందేశాలను అందించారు. ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు అంబేద్కర్‌ జీవిత చరిత్ర పై ప్రదర్శించిన నత్య రూపకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. తొలుత టిఆర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థినిల వందేమాతరం ప్రార్థనా గీతం తో సభ ప్రారంమైంది. డీఎల్‌ డిఓ, కమిషనర్‌ మనోహర్‌, ఎంపీడీవో విజయశేఖర్‌ మున్సిపల్‌ మేనేజర్‌ చంద్రమోహన్‌ సమన్వయం చేశారు

➡️