ఆదివాసీలకు అమ్మ ట్రస్ట్‌ రగ్గుల పంపిణీ

అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌

ప్రజాశక్తి- కె.కోటపాడు /అనంతగిరి: అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివారు కొత్తవలస, తోటవలస గ్రామాల్లో ఉన్న గిరిజనులకు అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రగ్గులు పంపిణీ చేశారు. ట్రస్ట్‌ కుటుంబ సభ్యులంతా కాలినడకన కొండలపైనున్న ఆయా గ్రామాలకు వెళ్లి 25 కుటుంబీకులకు రగ్గులు అందజేశారు.ఈ సందర్భంగా అమ్మ ట్రస్ట్‌ చైర్మన్‌ గొంప వెంకటరావు మాట్లాడుతూ చలికాలంలో ఏజెన్సీవాసులు ఎముకలు కొరికే చలిలోపడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొందరికైనా చలి నుంచి ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో తమ ట్రస్ట్‌ ద్వారా రగ్గులు పంపిణీ చేసినటు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో విద్య, ఆరోగ్యం ఇతరత్రా అవసరాలపై అమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ నిత్యం గిరిజనానికి సేవలు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో సూరెడ్డి బాబూరావు, లెక్కల నారాయణరావు, లెక్కల సత్యనారాయణ, దొగ్గ ఎరుకు నాయుడు, మహిళా పోలీస్‌ లావణ్య, వాలంటీర్‌ రామకృష్ణ, స్థానిక గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

రగ్గులను పంపిణీ చేస్తున్న ట్రస్ట్‌ ప్రతినిధులు

➡️