ఆధార్‌తోనే ఉపాధి

Jan 2,2024 21:30

జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధార్‌తో అనుసంధానించి వేతనాలు చెల్లించే విధానం ప్రారం భమైంది. జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానించడంపై విమర్శలు వెల్లువెత్తినప్పటికీ ఆధార్‌తో జాబ్‌కార్డులను అనుసంధానించడాన్ని అమలు చేయడానికే సిద్ధమైంది. గతేడాది జనవరి 30న ఆధార్‌తో జాబ్‌ కార్డులను అనుసంధానించడం తప్పనిసరి చేశారు. గత నెల 27 నాటికి జాబ్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 82 మంది జాబ్‌కార్డుదారులు ఆధార్‌ అథంటికేషన్‌ వెలుపలే మిగిలి పోవడంతో ఉపాధి కరువైంది. కార్మికుని బ్యాంకు ఖాతా, జాబ్‌కార్డు రెండూ ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. భారతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ మ్యాపర్‌తో కూడా అనుసంధానం చేయాల్సి ఉంటుంది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లాలో 3,35,986 జాబ్‌ కార్డుదారులు ఉన్నారు. వీరికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.340 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి లక్ష్యాన్ని సునాయాసంగా అధిగ మించారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 30న ఉపాధిని ఆధార్‌తో అనుసంధానించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వెనక్కి తగ్గలేదు. తీవ్ర వ్యతిరేకతల అనంతరం ఐదు విడతలుగా గడువు ఇస్తున్నప్పటి పేర్కొంది. గతేడాది డిసెంబర్‌ 27 నాటికి గడువు ముగిసినట్లు ప్రకటించింది. జిల్లాలోని 3,35,986 జాబ్‌కార్డులను అనుసంధానించింది. ఈ లెక్కన 99.98 శాతం అనుసం ధానించింది. ఈలెక్కన 82 మంది ఆధార్‌ అనుసంధానానికి నోచుకోలేదు. 7 మండలాలు..82 మందిజిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 82 మంది జాబ్‌కార్డు హోల్టర్లు అనుసంధానం చేసుకోలేదు. కమలాపురం, ఖాజీపేటలో ఒక్కొక్కటి, కొండాపురం, సిద్ధవటంలో ఆరు, లింగాలలో ఏడు, పెద్దముడియం, వీరపు నాయునిపల్లెలో ఐదు, రాజుపాలెం రెండు, కాశినాయనలో 11, సింహా ద్రిపురంలో ఎనిమిది, వేంపల్లిలో మూడు, వేములలో నలుగురు జాబ్‌కార్డు హోల్డర్లు ఆధార్‌తో అనుసంధానించడం కుదరలేదు. మూడు వారాలుగా అందని వేతనాలు జిల్లాలోని 3,35,986 మంది జాబ్‌కార్డు హోల్టర్లకు మూడు వారా లుగా వేతనాలు అందడం లేదు. ప్రతి రోజూ సగటున రూ.261, రూ.24 వెరసి రూ.285 వేతనం చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన వారానికి ప్రతికూలీకి రూ.1,795 చెల్లించాల్సి ఉందని చింతకొమ్మదిన్నె మండలం కొలుములపల్లి గ్రామానికి వీరమ్మ అనే మహిళా ఉపాధి కూలీ పేర్కొనడం గమనార్హం. లక్కి రెడ్డి పల్లి గ్రామానికి చెందిన దొడ్డి గంగయ్య అనే ఉపాధి కూలీ 150 రోజులు ఉపాధి కల్పించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఏదేమైనా ఉపాధి హామీ పథకం పనుల కత్తిరింపులపై ఉపాధి హామీ కూలీలకు ఇస్తున్న నీళ్లు, తట్టలకు రూ.18, నీళ్లకు రూ.15 రోజులు, మేట్ల వ్యవస్థను పునరుద్ధరించాలని కోరడం గమనార్హం.ఉపాధి కూలి పెంచాలి ఉపాధి కూలీలకు వేతనం పెంచాలి. ప్రతిరోజూ రెండు పూటలా పనిచేస్తే రూ.285 వరకు పరిమితం అవుతోంది. కూలీలకు ఎటువంటి ఉపయో గమూ లేకుండా పోతోంది. ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా వృద్ధులకు ఉపాధి హామీ దూరమయ్యే అవకాశం ఉంది.- బొగ్గడి ప్రతాప్‌రెడ్డి, కొలుములపల్లి, సికె దిన్నె.పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి జిల్లాలో మూడు వారాలుగా ఉపాధి కూలీలకు వేతనాలు పడటం లేదు. రోజంతా శ్రమటోడ్చిన పనులకు సకాలంలో వేతనాలు జమ చేయాలి. వారాల తరబడి ఆలస్యం చేస్తే రానున్న పండుగలు, ఇతర కార్యక్రమాలకు అప్పులు చేసుకోవాల్సి వస్తుంది.- కె.వెంకటసుబ్బయ్య, లక్కిరెడ్డిపల్లి, సికె దిన్నె.వంద శాతం అనుసంధానించాం జిల్లాలోని ఉపాధి జాబ్‌కార్డులకు నూరు శాతం ఆధార్‌తో అను సంధానం చేశాం. కేవలం 82 జాబ్‌కార్డులకు ఆథంటికేషన్‌ చేయడంలో ఇబ్బం దులు రావడంతో ఆలస్యమవుతోంది. త్వరలో వీటిని సైతం అనుసంధానం చేస్తాం. – డి.యధుభూషణ్‌రెడ్డి, డ్వామా పీడీ, కడప.

➡️