ఆన్‌లైన్‌్‌ స్కోర్‌ విధానంపై అవగాహన పెంచుకోవాలి

Dec 14,2023 19:30
మాట్లాడుతున్న ఎంపిడిఒ ఆన్‌లైన్‌్‌ స్కోర్‌

మాట్లాడుతున్న ఎంపిడిఒ
ఆన్‌లైన్‌్‌ స్కోర్‌ విధానంపై అవగాహన పెంచుకోవాలి
ప్రజాశక్తి-కోవూరు:స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం అన్ని నచివాలయాలకు సంబంధించిన డిజిటల్‌ ఇంజినీరింగ్‌, అసిస్టెంట్లకు ఆడుదాం ఆంధ్ర మంచి ఆన్లైన్‌ స్కోర్‌ చేసే విధానంపై అవగాహన కల్పిచే కార్యక్రమాన్ని ఎంపీడీఓ శ్రీహరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకు సంబంధిత అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చిన నేపథ్యంలో ఈ క్రీడలను పూర్తిస్థాయిలో విజయవంతం చేసేలా సమిష్టి కషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మండలంలో ఎంపిక చేసిన 8 క్రీడా మైదానాల్లో ఖోఖో, వాలీబాల్‌, షటిల్‌, క్రికెట్‌కు సంబంధించిన అవసరమైన చోట్ల పోల్స్‌ నాటించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. డిజిటల్‌ అసిస్టెంట్లు ఈ ఆటకు సంబందించిన ఆన్లైన్లో స్కార్‌ చేసే విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా నచివాలయ ఉద్యోగులకు ఆన్లైన్‌ స్కోర్‌ విధానంపై అవగాహన కల్పించారు.

➡️